తెలుగు వాళ్ళు గర్వపడే సినిమా

రచయిత దీన్‌రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ‘భారతీయన్స్‌’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని, ఈనెల 14న తెలుగు – హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సిద్ధమైంది. భారత్‌ అమెరికన్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్‌ శంకర్‌ నాయుడు అడుసుమిల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదల నేపథ్యంలో దర్శకుడు దీన్‌రాజ్‌ మాట్లాడుతూ,’చైనా బోర్డర్‌లో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి చిత్రీకరణ చేశాం. అలాగే వర్షాలు కురిసి, కొండచరియలు విరిగిపడి ఎప్పుడు చిత్రీకరణ ఆగిపోతుందో తెలియని పరిస్థితుల్లో చేశాం. ఇలా ఎన్నో కష్టాలు పడ్డాం. ఎన్ని కష్టాలు పడితే ఏంటి? తెలుగు వాళ్లు గర్వపడే సినిమా తీశాం. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దర్శకుడు వివేక్‌ అగ్నిహౌత్రి మా చిత్రంపై ప్రశంసలు కురిపించడంతో మేం పడ్డ కష్టం అంతా మర్చిపోయేలా చేసింది. ప్రీమియర్‌ షోస్‌ అన్నింటికీ అసాధారణ స్పందన వచ్చింది’ అని తెలిపారు.

Spread the love