జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రంగి’. రసమయి బాలకిషన్ నిర్మాతగా అజరు సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమత మోహన్ దాస్, విమల రామన్, గానవి లక్ష్మణ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు అజరు సామ్రాట్ మాట్లాడుతూ, ‘మా సినిమాకు అన్ని చోట్ల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని అన్నారు.
‘సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇందులో నేను చేసిన మల్లి పాత్రను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు’ అని ఆశిష్ గాంధీ చెప్పారు.
డీఓపి సంతోష్ మాట్లాడుతూ,’థియేటర్లలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని తెలిపారు.