ప్రముఖ యాక్టింగ్ గురు మహేష్ గంగిమళ్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ విఆర్‌జిఆర్ మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘పొక్కిలి’. ఈ చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్, పోస్టర్ లాంచ్ వేడుక దర్శకులు సుకుమార్ చేతుల మీదుగా జరిగింది. ఈ నేపథ్యంలో సుకుమార్ మాట్లాడుతూ, ‘కొత్తగా ట్రై చేస్తున్న ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు ఇప్పుడు మంచి ఆదరణ ఉంటోంది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు మంచి విజయం లభించాలి’ అని తెలిపారు. ‘ఈసినిమా క్లైమాక్స్, రెండు సాంగ్స్ మినహా మొత్తం షూటింగ్ పూర్తి అయ్యింది. కెమెరామెన్ జయపాల్ నిమ్మల అద్భుతమైన విజువల్స్‌తో పాటు మంచి విలువలతో కూడిన స్క్రిప్ట్, దర్శకత్వం మా చిత్రానికి బలం’ అని నిర్మాత గొంగటి వీరాంజనేయ నాయుడు (జి.వి.నాయుడు) తెలిపారు. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో రియలిస్టిక్ అప్రోచ్‌తో వస్తున్న ఈ చిత్రంతో హీరో, హీరోయిన్స్‌గా తన దగ్గర నటన నేర్చుకున్న నేత్ర, శ్రేయస్ బట్టోజు, సుధీర్ శర్మ, సాయి రాఘవేంద్ర, ప్రద్యుమ్నని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నామని దర్శకుడు మహేష్ గంగిమళ్ళ తెలిపారు. కాలకేయ ప్రభాకర్ విభిన్నమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా రమణ చల్కపల్లి, మల్లేష్ బాలాస్ట్, శ్రీలక్ష్మి గోవర్ధన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి స్టంట్స్: రాజకుమార్ గోల్డ్ ఫిష్, ఎడిటింగ్: వెంకట ప్రభు.