హాయిగా నవ్వుకునే చిత్రం

నాకు బాక్సింగ్‌ యాక్షన్‌, డ్యాన్స్‌, ఎమోషనల్‌గా ఉండే సినిమా లంటే ఇష్టం. త్వరలో ఒక ఎమోషనల్‌ రోల్‌ ఉన్న సినిమా చేస్తున్నాను. దీంతోపాటు ‘గుండెల్లో దమ్ము’, 1980 నేపథ్యంలో ఉండే ఒక లవ్‌ స్టొరీ చిత్రంలో నటిస్తున్నాను.
సుధాకర్‌ కోమాకుల హీరోగా నటించిన హిలేరియస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నారాయణ అండ్‌ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకత్వంలో పాపిశెట్టి ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌, సుఖ మీడియా బ్యానర్‌ల పై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానున్న నేపథ్యంలో హీరో సుధాకర్‌ కొమాకుల విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘నాకు నిర్మాణంపై ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. మొదటి నుంచి వీడియోస్‌, కవర్‌ సాంగ్స్‌ చేస్తూనే ఉన్నాను. ఈ సినిమా కంటే ముందు ‘రీసెట్‌’ అనే సినిమా మొదలుపెట్టాం. అది ఇంకా టేకాఫ్‌ కాలేదు. దర్శకుడు చిన్నా ఈ కథ చెబుతున్నపుడు చాలా గమ్మత్తుగా అనిపించింది. ఏం చేసిన ఫ్యామిలీ అంతా చేస్తారని చెప్పడం చాలా కొత్తగా, హిలేరియస్‌గా ఫీల్‌ అయ్యాను. ఇది ఫ్యామిలీ మూవీ. ఇలాంటి సినిమాతో నిర్మాణంలోకి రావడం చాలా ఆనందంగా అనిపించింది. సినిమా అంతా చాలా ఫన్‌గా ఉంటుంది. ఫ్యామిలీ అండ్‌ క్రైమ్‌ కామెడీ రెండూ అందర్నీ అలరిస్తాయి. ఇందులో తండ్రి పాత్రకు ఎవరిని తీసుకోవాలని అలోచిస్తున్నప్పుడు దేవి ప్రసాద్‌ పేరు చెప్పాను. ఆయన సీరియస్‌ రోల్స్‌ చేసినా మంచి కామెడీ సినిమాలు తీశారు. అలాగే బయట ఆయన చాలా సరదాగా ఉంటారు. ఈ పాత్రకు ఆయనైతే పర్ఫెక్ట్‌ అనిపించింది. ఇందులో నారాయణ గారి అబ్బాయి పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చాలా సహజంగా, సెటిల్డ్‌గా ఉంటుంది . నాకు కామెడీ చాలా ఇష్టం. ఇందులో ఫుల్‌ లెంత్‌ వినోదం చేసే అవకాశం దక్కింది. ముఖ్యంగా అమాయకత్వం నుంచే పుట్టే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులో నలుగురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ చేశారు. అలాగే ఈ చిత్రానికి మహిళా ఎడిటర్‌ సజన అడుసుమల్లి అద్భుతమైన వర్క్‌ ఇచ్చారు.

Spread the love