నయా సస్పెన్స్‌ థ్రిల్లర్‌

డైరెక్టర్‌ శంకర్‌ ప్రొడక్షన్స్‌ ఎస్‌ పిక్చర్స్‌ పతాకంపై మొదటిసారి సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌’ చిత్రాన్ని నిర్మించారు. ‘షాపింగ్‌ మాల్‌, ఏకవీర’ తదితర సెన్సిబుల్‌ చిత్రాలను రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంతబాలన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్‌దాస్‌ హీరోగా, దుసరా విజయన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ను ట్విట్టర్‌ వేదికగా నిర్మాత దిల్‌ రాజు విడుదల చేశారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 21న విడుదలకానుంది.
తెలుగులో ఎస్‌.ఆర్‌డి.ఎస్‌ సంస్థ చిత్రాన్ని రిలీజ్‌ చేయనుంది.. సంగీత దర్శకుడు జీ.వి.ప్రకాష్‌ నాలుగు అద్భుతమైన పాటలు అందించారు. ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు వసంతబాలన్‌ చెప్పారు. ఇంకా ఈ చిత్రంలో వనితా విజరుకుమార్‌, అర్జున్‌ చిదంబరం, సురేష్‌ చక్రవర్తి తదితరులు నటించారు.

Spread the love