రేవ్‌ పార్టీ షూటింగ్‌ పూర్తి

బొనగాని ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రేవ్‌ పార్టీ’. శుక్రవారంతో దిగ్విజయంగా ఈ సినిమా షూటింగ్‌ ముగించుకుంది. క్రిష్‌ సిద్దిపల్లి, రితిక చక్రవర్తి, ఐశ్వర్య గౌడ, సుచంద్ర ప్రసాద్‌, తారక్‌ పొన్నప్ప తదితరుల ముఖ్య తారగణంతో మైసూర్‌, ఉడిపి, బెంగళూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో 35 రోజులు ఏకధాటిగా షూటింగ్‌ జరుపుకుంది క్రిష్‌ సిద్దిపల్లి హీరోగా, రితిక చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఐశ్వర్య గౌడ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళం భాషలలో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్‌ రాజు బొనగాని మాట్లాడుతూ,’అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా ఇది. సాధారణంగా ఉడిపి, గోవా, బెంగుళూరు లాంటి ప్రాంతాలలో ఎక్కువగా రేవ్‌ పార్టీలు జరుగుతుంటాయి. అందుకే ఆ ప్రాంతాల్లోనే ఒరిజినల్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశాం. అలాగే రేవ్‌ పార్టీలు ఎలా జరుగుతాయి?, ఆ రేవ్‌ పార్టీల వెనుక ఎవరెవరు ఉంటారు?, వాటి వల్ల యువతకు జరిగే నష్టం ఏంటి అనేది ఈ చిత్రంలో స్పష్టంగా చూపించబోతున్నాం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఆగస్ట్‌లో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.

Spread the love