‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ సినిమా స్కాట్ టీమ్స్ స్క్రీన్‌ప్లే, లీ వాన్నెల్ కథ నుండి పాట్రిక్ విల్సన్ దర్శకత్వం వహించిన చిత్రం. ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ చిత్రం ‘ఇన్సిడియస్ అండ్ ఇన్సిడియస్: చాప్టర్ 2’కి ప్రత్యక్ష సీక్వెల్. ఇన్సిడియస్ ప్రసిద్ధ హర్రర్ ఫ్రాంచైజీకు 5వ ఐదవ భాగం ఈ సినిమా. సోనీ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈనెల 6 గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఇన్సిడియస్: చాప్టర్ 2’కి ముగింపు సంఘటనల అనంతరం ఈ సినిమా పది సంవత్సరాల తర్వాత ప్రారంభం అవుతుంది. జోష్ లాంబెర్ట్ తన కొడుకు డాల్టన్‌ను ఒక ఇడిలిక్, ఐవీ-లీగ్ విశ్వవిద్యాలయంలో జాయిన్ చేయటానికి వెళతాడు. అయినప్పటికీ, డాల్టన్ ఆ కళాశాలలో చేేరడం ఒక పీడకలగా మారుతుంది. అతనితో గతంలోని శిక్ష వేయబడిన వారు (దెయ్యం లాంటి రాక్షసులు) అకస్మాత్తుగా వారిద్దరినీ వెంటాడడానికి తిరిగి వస్తారు. వారిని అంతం చేయడానికి, ఆ రాక్షసులును ఒక్కసారిగా కంట్రోల్‌లోకి తీసుకోవడానికి, లాంబెర్ట్ పీడకలని ఆపడానికి జోష్, డాల్టన్ మరోసారి ఏం చేశారనేదే ఈ సినిమా. ఈ చిత్రం ద్వారా పాట్రిక్ విల్సన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టై సింప్కిన్స్, రోజ్ బైర్న్, ఆండ్రూ ఆస్టర్ ఇతర తారాగణంలో సింక్లెయిర్ కూడా ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం-పాట్రిక్ విల్సన్, స్క్రీన్ ప్లే- స్కాట్ టీమ్స్.