రంగబలి రిలీజ్‌కి రెడీ..

హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్‌ బాసంశెట్టి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రంగబలి’. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. మంగళవారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. హీరో తన ఊరు పై ఉన్న అభిమానానికి కారణాన్ని చెప్పడంతో ట్రైలర్‌ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. స్నేహితులతో తిరుగుతూ కాలం గడిపేస్తున్న హీరో ఓ డాక్టర్‌తో ప్రేమలో పడతాడు. అలాగే స్థానికంగా ఉన్న నాయకుడికి ఫాలోవర్‌గా ఉంటాడు. అయితే వారి మధ్య శత్రుత్వం ఏర్పడి గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఆద్యంతం ఆసక్తికరమని ట్రైలర్‌ చెప్పకనే చెప్పింది. ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ,’ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. దర్శకుడు పవన్‌ చెప్పింది చెప్పినట్లుగా తీశాడు. యుక్తి తరేజ చాలా బాగా నటించింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు. ‘ఈ కథలో ‘రంగబలి’ అనేది మెయిన్‌ సెంటర్‌. దానికి తగ్గట్టు ఈ చిత్రానికి ఆ టైటిల్‌ పెట్టాం. జూలై 7న సినిమా వస్తోంది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం’ అని దర్శకుడు పవన్‌ చెప్పారు.

Spread the love