భిన్న ప్రేమకథ

డైరెక్టర్‌ కె దశరథ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్‌ యు రామ్‌’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాత కూడా. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్దనన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈనెల 30న విడుదల కానున్న నేపథ్యంలో దర్శక, నిర్మాత డివై చౌదరి విలేకరుల సమావేశంలో ‘లవ్‌ యు రామ్‌’ గురించి తెలిపిన విశేషాల సమాహారం.. ‘ఇప్పటివరకూ చూసిన ప్రేమ కథలకు ‘లవ్‌ యు రామ్‌’ చాలా భిన్నంగా ఉంటుంది. ప్రేమించడమే జీవితం అని నమ్మే ఒక అమ్మాయి, నమ్మించడమే జీవితం అనుకునే అబ్బాయి మధ్య జరిగే అందమైన ప్రేమకథ. ఈ సినిమాలో నిజమైన ప్రేమని చెప్పాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆశించి, కొన్ని అంచనాలతో ప్రేమిస్తారు. ఈ క్రమంలో మంచే మొదట కనిపిస్తుంది. అయితే ఒకసారి ప్రయాణం మొదలైన తర్వాత తనలోని ఒక్కొక్క లేయర్‌ బయటికి వస్తే ప్రేమించిన అమ్మాయి ఎలా ఫీలౌతుంది?, అమ్మాయి ఆ ప్రేమని వదులుకుందా లేదా అతనిలో మార్పుని తెచ్చిందా? అనేది చాలా అందంగా చూపించాం. నేను, దశరథ్‌ చిన్నప్పటి నుంచి స్నేహితులం. నిజానికి ఈ చిత్రానికి దశరథ్‌ దర్శకత్వం చేయాలి. అయితే ఇందులో ఖచ్చితంగా దశరథ్‌ బ్రాండ్‌ ఉంటుంది. సినిమాలో చిన్న బిట్స్‌గా నాలుగు ఇంగ్లీష్‌ సాంగ్స్‌ వస్తాయి. అలాగే ఒక హిందీ పాట కూడా ఉంది. పాటల పరంగా ఇప్పటికే చాలా పెద్ద హిట్‌ అయ్యింది. వేద ఈ చిత్రానికి చాలా అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. ప్రస్తుతం మూడు వెబ్‌ సిరిస్‌లు రెడీ అవుతున్నాయి’ అని చెప్పారు.

Spread the love