నవతరం సత్యభామ

కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న కొత్త చిత్రానికి ‘సత్యభామ’ టైటిల్‌ అనౌన్స్‌ చేశారు. ఈ చిత్రాన్ని ఆరమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్‌’ చిత్ర దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ, స్క్రీన్‌ ప్లే అందించారు. అఖిల్‌ డేగల దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం కాజల్‌ అగర్వాల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు తక్కలపల్లి మాట్లాడుతూ, ”సత్యభామ’ గ్లింప్స్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది’ అని తెలిపారు. ‘ఫీమేల్‌ ఒరియెంటెడ్‌ సబ్జెక్ట్‌ కాజల్‌కి నచ్చి. సినిమా చేసేందుకు అంగీకరించారు. ఫిల్మ్‌ స్కూల్‌లో గ్రాడ్యూయేట్‌ చేసిన అఖిల్‌ను దర్శకుడిగా ఎంచుకున్నాం. తన వర్క్‌ మాకు అందరికీ బాగా నచ్చింది. ఈ సినిమా ఒక యూనిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని ఆశిస్తున్నాం’ అని శశికిరణ్‌ తిక్క అన్నారు.దర్శకుడు అఖిల్‌ డేగల మాట్లాడుతూ, ‘ఆరమ్‌ ఆర్ట్స్‌ సంస్థలో మొదటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం నాకు దక్కడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘పెళ్ళైన నాయికలు తమ కెరీర్‌ కొనసాగించాలి అనేందుకు కాజల్‌ నిదర్శనం. ఈ చిత్ర గ్లింప్స్‌ చూశాను. కాజల్‌ క్యారెక్టరైజేషన్‌, డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి’ అని దర్శకుడు శేఖర్‌ కమ్ముల చెప్పారు.’శేఖర్‌ కమ్ముల గారి సినిమాల్లో హీరోయిన్స్‌ను ఎంతో పవర్‌ ఫుల్‌గా చూపిస్తారు. నా పుట్టిన రోజున ఫస్ట్‌ గ్లింప్స్‌తో మా టీమ్‌ సర్‌ప్రైజ్‌ చేయడం సంతోషంగా ఉంది’ అని నాయిక కాజల్‌ అగర్వాల్‌ అన్నారు.

Spread the love