నీ రాక కోసం…

పై శీర్షిక చూసి, ఇదేదో పాత సినిమాలోని పాటనుకునేరు. ఇది పాట కానే కాదు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలోని జనాలందరూ, ముఖ్యంగా రైతులు ఆకాశం వైపు చూసి… ఇదే రీతిన గుబులైపోతున్నరు. ఈనెల మొదటి వారంలో తొంగి చూడాల్సిన రుతు పవనాలు… ఇప్పటిదాకా రాకుండా ముఖం చాటేశాయి. ఫలితంగా మే నెలకు మించిన ఎండలు జూన్‌లోనూ కొనసాగుతున్నాయి. ఆ కారణంగా విత్తనాలు విత్తాల్సిన అన్నదాతలు… తొలకరి పలకరింపు కోసం కండ్లు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. ఇకనైనా రుతుపవనాలు తమ దోబూచులాటను ఆపి… కరుణించాలని కోరుకుందాం.
-ఎస్‌.వెంకన్న

Spread the love