నాకేడ్పొచ్చింది..! అందుకే బాత్‌రూంలోకి పోయి ఏడ్సినా..! అన్నడు ఓ పువ్వు గుర్తు పార్టీ లీడరు. గాయనెవ్వరో సమజైతలేనుల్లా… గదే కోమటిరెడ్డి రాజగోపాలుడు. ఇంతకెందుకేడ్సిండో చెప్పిండా మరీ… గదే కమలం పువ్వుగుర్తు పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజరు దిగిపోయినందుకట! అందుకే గాయన్ను సూస్తే బాధని పించిదంట! గిదంతా ఒకెత్తయితే… అసలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినొళ్లే ఏడ్సేదేందని ముక్కునేలేసుకుంటున్నారు. అంతేకాదు..జర నన్నయితే పనిజేయనివ్వలే… ఇగ కిషన్‌రెడ్డినన్న పనిజేయనియ్యండ్రి.. ఫిర్యాదు చేయకండ్రని సంజ యన్నా కూడ చెప్పే. అంతజేసినంకా ఏడ్సుడెందుకో మరీ! ఆ ఏడ్పేందో ముందేడ్సితే బాగుండేది కదా. ఏమో అనుకోని ఫిర్యాదు చేస్తే ఏకంగా అధ్యక్షుడినే మార్చేశారు. గింతదాక వస్తదనుకోకపోవచ్చు. కానీ క్రమశిక్షణలో మారుపేరని చెప్పుకుంటున్న కమలం పార్టీలోనూ నేతలు దారి తప్పుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నవి.
– నిరంజన్ కొప్పు