కల కంటూ ఉంటే..

హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా సినిమా ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్‌ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్‌ సోమవారం ‘లవ్‌ స్టోరీ’ ఫేమ్‌ పవన్‌ సిహెచ్‌ స్కోర్‌ చేసిన సెకండ్‌ సింగిల్‌ ‘కల కంటూ ఉంటే’ పాటని విడుదల చేశారు. మొదటి పాట మాస్‌ నంబర్‌ అయితే, రెండవది మంత్రముగ్ధులను చేసే మెలోడీ. శౌర్య, యుక్తి మధ్య ఉన్న అందమైన బంధాన్ని ఈ పాట అద్భుతంగా చూపిస్తుంది. సార్థక్‌ కళ్యాణి, వైష్‌ వోకల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. కష్ణకాంత్‌ సాహిత్యం ఆకట్టుకుంటుంది. నాగ శౌర్య, యుక్తి కెమిస్ట్రీ, విజువల్స్‌ అలరిస్తున్నాయి అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Spread the love