చిరంజీవి లేటెస్ట్‌గా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మొదటి సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలవగా, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఇప్పుడు మేకర్స్ మరొక ట్రీట్‌ని రెడీ చేశారు. ఈ చిత్రలోని సెకండ్ సింగిల్ ‘జామ్ జామ్ జజ్జనక’ ఈనెల 11న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఈ పాట ప్రోమో ఆదివారం సాయంత్రం రిలీజ్ అయ్యింది. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చిరంజీవి లుక్ అందర్నీ అలరిస్తోంది. టైటిల్, పోస్టర్ ఈ పాట మెగా డ్యాన్స్ ట్రీట్‌గా ఉండబోతుందని సూచిస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అటు ప్రేక్షకులు, ఇటు మెగా అభిమానుల్లో భారీ అంచనాలను పెంచిన ఈ చిత్రాన్ని ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా, తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఇందులో చిరు సరసన తమన్నా నటిస్తుండగా, ఆయన చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించనున్నారు. సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ, తరుణ్ అరోరా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ, కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్.