వినూత్న పాయింట్‌తో నాతో నేను

సాయికుమార్‌, శ్రీనివాస్‌ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్‌, ఐశ్వర్య రాజీవ్‌ కనకాల కీలక పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్ర టీజర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ ”టీజర్‌గా సినిమా పాయింట్‌ నచ్చింది. కొత్తగా అనిపించింది. ఈ మధ్యకాలంలో కొత్త లైన్‌, కొత్త టీమ్‌ చేసే ప్రతి సినిమా సక్సెస్‌ అవుతుంది. కథలో కొత్తదనం ఉంది. చక్కని కథనం, సస్పెన్స్‌ క్యారీ చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను” అని అన్నారు.
‘జబర్దస్త్‌ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాట, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం’ అని అన్నారు.
”త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం” అని నిర్మాత చెప్పారు.
నటీనటులు – సమీర్‌, సి.వి.ఎల్‌ నరసింహారావు, గౌతమ్‌ రాజు ఎమ్మెస్‌ చౌదరి, భద్రం, సుమన్‌ శెట్టి తదితరులు
సాంకేతిక నిపుణులు – కెమెరా : యూవి. మురళీమోహన్‌ రెడ్డి, సంగీతం : సత్య కశ్యప్‌, బ్యాక్‌గ్రౌండ్‌ : ఎస్‌. చిన్న, ఎడిటింగ్‌ : నందమూరి హరి, ఆర్ట్‌ : పెద్దిరాజు అడ్డాల, పాటలు : రామజోగయ్య శాస్త్రి, శాంతికుమార్‌, కొరియోగ్రాఫర్‌ : భాను, చంద్ర కిరణ్‌, ఫైట్స్‌ : నందు, సమర్పణ : ఎల్లలు బాబు టంగుటూరి.

Spread the love