100 థియేటర్స్‌ లో కుట్ర

సిరి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సిరిపురం రాజేష్‌ డిటెక్టివ్‌ పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘కుట్ర’ (ద గేమ్‌ స్టార్ట్ప్‌ నవ్‌ ట్యాగ్‌లైన్‌). ప్రీతి, గీతిక రతన్‌, ప్రియ దేశ్‌పాల్‌ హీరోయిన్లు. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్‌లో ప్రీ-రిలీజ్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, టియస్‌ టూరిజం డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ ఎక్స్‌ చైర్మన్‌ ఉప్పాల శ్రీనివాస్‌ గుప్తా, టియస్‌ ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఎక్స్‌ చైర్మన్‌ అమరవాది లక్ష్మినారాయణ, సినీ ప్రముఖులు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, లయన్‌ సాయి వెంకట్‌, చిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు సిరిపురం రాజేష్‌, హీరోయిన్లు ప్రియ, గీతిక, ప్రీతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోలేటి దామోదర్‌ మాట్లాడుతూ… సిరిపురం రాజేష్‌ అడ్వకేట్‌గా, వ్యాపారవేత్తగా, జర్నలిస్ట్‌గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడం గొప్ప విషయం. సినిమా చూశాము. అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.
ఉప్పాల శ్రీనివాస్‌ గుప్తా మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో ప్రతి విషయంలో కుట్రలే జరుగుతున్నాయి. అలాంటి టైటిల్‌తో ఓ చక్కటి చిత్రాన్ని తెరకెక్కించిన రాజేష్‌కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలన్నారు.
అమరవాది లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. రాజేష్‌ జర్నలిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో జోరుగా పాల్గొన్నారు. అడ్వకేట్‌గా కూడా మంచి పేరుంది. కరోనా టైమ్‌లో సిరిపురం రాజేష్‌ షార్ట్‌ ఫిలింస్‌ చేశారు. ఎప్పటికైనా సినిమా చేయాలని చెప్పేవాడు. కానీ ఇంత త్వరగా సినిమా చేసి దాన్ని రిలీజ్‌ చేస్తాడు అనుకోలేదు. ఈ సినిమా విడదులై ఆయనకు మంచి పేరు, లాభాలు తేవాలన్నారు.
నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. సిరిపురం రాజేష్‌ నటిస్తూ, స్వీయ దర్వకత్వంలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకక్కించారు. పాటలు, ట్రైలర్‌ చాలా బావున్నాయి. మంచి కాన్సెప్ట్‌ ఉంటే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు. కుట్ర అనే క్యాచీ టైటిల్‌ తో ఒక మంచి కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.
లయన్‌ సాయి వెంకట్‌ మాట్లాడుతూ కుట్ర ట్రైలర్‌, సాంగ్స్‌ చాలా బావున్నాయి. సిరిపురం రాజేష్‌ ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలన్నారు.
నటుడు, నిర్మాత, దర్శకుడు మాట్లాడుతూ సిరిపురం రాజేష్‌ మాట్లాడుతూ… మంచిర్యాలలో 1985 నుంచి నేను జర్నలిస్ట్‌గా పని చేశాను. ‘కుట్ర’ నా తొలి సినిమా. ఇద్దరి మిత్రుల మధ్య నడిచే సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ నెల 23న దాదాపు 100 థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఏ. వెంకటేష్‌, మంచాల రఘువీర్‌, కాచెం సత్యనారాయణ, సిరిపురం సత్యనారాయణ, ముక్త శ్రీనివాస్‌, ఎమ్‌. సురేంద్రనాథ్‌ రెడ్డి, మాదంశెట్టి సత్యనారాయణ, కొండా చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
సిరిపురం రాజేష్‌, విజయరంగరాజు, ఘర్షణ శ్రీనివాస్‌, గీతిక, ప్రియ, ప్రీతి, విష్ణు వర్థన్‌, ఉజ్వల తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం : రోహిత్‌ శౌర్‌, లిరిక్‌ రైటర్‌ : వెంకట్‌ బాలగోని, స్టోరీ : కాశి, కొరియోగ్రఫీ : గణేష్‌ మాస్టర్‌, నిర్మాత-దర్శకత్వం : సిరిపురం రాజేష్‌.

Spread the love