షికార్‌కి వచ్చిన షేర్‌ని..

చిరంజీవి, మెహర్‌ రమేష్‌, ఎకె ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ కాంబోలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’. ఈ చిత్ర టీజర్‌ను శనివారం లాంచ్‌ చేశారు. ’33 మందిని దారుణంగా చంపిన వ్యక్తి ఎవరు? డెన్‌లో గూండాలను చితకొట్టి ‘షికార్‌ కొచ్చిన షేర్‌ ని బే…” అని చిరు చెప్పిన డైలాగ్‌, ‘ఈ స్టేట్‌ డివైడ్‌ అయినా అందరూ నా వాళ్లే…
నాకు హద్దుల్లేవ్‌… సరిహద్దుల్లేవ్‌… 11 ఆగస్ట్‌ దేఖ్‌లేంగే…’ అంటూ చెప్పిన చివరి డైలాగ్స్‌
బాగా అలరిస్తున్నాయి’ అని చిత్ర బృందం తెలిపింది. దర్శకుడు మాట్లాడుతూ, ‘మెగాస్టార్‌లో మనకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి’ అని అన్నారు. ‘టీజర్‌ అదిరిపోయింది. సినిమా దీనికి మించి ఉంటుంది. ఆగస్ట్‌ 11న సినిమా వస్తోంది. చిరంజీవి కెరీర్‌లో నెంబర్‌1 సినిమా అవుతుంది’ అని నిర్మాత అనిల్‌ సుంకర తెలిపారు.

Spread the love