భిన్న మనస్తత్వాల ప్రయాణం

హీరో శ్రీవిష్ణు, ‘వివాహ భోజనంబు’ ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సామజవరగమన’. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌ సుంకర సమర్పిస్తున్నారు. ఆదివారం చిరంజీవి ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్‌ చేసి, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ‘మల్టీప్లెక్స్‌లోని ఫుడ్‌ కోర్ట్‌లో శ్రీవిష్ణు అకౌంట్‌లో రెబా మోనికా జాన్‌, ఆమె కుటుంబం జంబో పాప్‌కార్న్‌ బకెట్లను తీసుకెళ్తున్న హిలేరియస్‌ సన్నివేశంతో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఇందులో శ్రీ విష్ణు పేరు బాలు. శ్రీవిష్ణు ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడిలా ఆలోచిస్తూ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతుండగా, రెబా అతనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అమ్మాయిల పట్ల విరక్తి పెంచుకునే ఈ కుర్రాడు రెబాతో ప్రయాణంలో తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకుంటాడనేది కథ. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేస్తున్నారు.

Spread the love