తెలుగులోనూ ఇన్ని కోట్ల కలెక్షన్స్‌ ఊహించలేదు

తెలుగునాట కూడా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, సెన్సేనల్‌ హిట్‌గా నిలిచి అద్భుతమైన కలెక్షన్‌లు సాధిస్తున్న సినిమా ‘2018’. మే 5న మలయాళంలో రిలీజై అక్కడ రూ.150 కోట్ల మార్క్‌ టచ్‌ చేసి ఇండిస్టీ హిట్‌గా నిలిచింది. ఇక గతవారం తెలుగులో విడుదలై, ఇక్కడ కూడా భారీ కలెక్షన్‌లు సాధించి, సుమారు 6 కోట్ల మార్క్‌ టచ్‌ చేసింది. ఈ సినిమా ప్రస్తుతం లాభాల్లో ఉంది. 2018లో కేరళని ముంచెత్తిన భీకర వరదల్ని, ఆ వరదల్లో బాధితులు ప్రాణాల కోసం చేసిన పోరాటాల్నీ ఆధారంగా చేసుకుని ఈ సినిమాని దర్శకుడు జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ హద్యంగా తెరకెక్కించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన థ్యాంక్స్‌ మీట్‌లో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, ‘నేను ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక తుఫాన్‌లో ఉన్నట్టు ఉంది. ఈ సినిమాలో ఫైట్లు లేవు. డాన్సులు లేవు. ఓన్లీ ఉద్వేగం ఉంది. సినిమా చూడాలి అనుకున్నా వారు థియేటర్లోనే చూడండి లేదంటే ఆ ఫీల్‌ మిస్‌ అవుతారు. మలయాళంలోనే కాదు తెలుగులో కూడా ఇన్ని కోట్ల కలెక్షన్లు సాధిస్తుందని ఊహించలేదు’ అని అన్నారు.
దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ,’ఈ సినిమా చూశాక చాలా కాలం తర్వాత చప్పట్లు కొట్టా. అలాగే ఫస్ట్‌ టైం వర్షం మీద కోపం వచ్చింది. ఈ సినిమా అంతా ఒక ఉద్వేగంతో నడుస్తుంది. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసి ఆడియన్స్‌కు థ్యాంక్స్‌’ అని చెప్పారు. బన్నీ వాసు మాట్లాడుతూ,’నేను ఇలాంటి విభిన్నమైన సినిమాలు తీసుకురావడానికి కారణం అరవింద్‌. ఈ సినిమా రిలీజ్‌ అయ్యాక ఆయనపై ఎక్కడలేని గౌరవం పెరిగింది సినిమాని బ్లాక్‌ బస్టర్‌ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని తెలిపారు.

Spread the love