ప్రేమలో కొత్త కోణం..

లవ్‌ స్టోరీల్లో డిఫరెంట్‌ యాంగిల్‌ తీసుకుని సరికొత్త ప్రేమకథా చిత్రంగా ‘ఓ సాథియా’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తు న్నారు. నేటితరం ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యే సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తన్వికా-జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటిస్తున్నారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ బోర్డ్‌ నుంచి క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ పొందింది.
ఈ సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు చిత్ర యూనిట్‌ని ప్రత్యేకంగా అభినందించారు. చిత్రంలోని సన్నివేశాలపై పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్‌ జోష్‌లో నటులు ఆలీ ఇంటరాక్ట్‌ కావడం, లెజెండరీ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ ఇంటర్వ్యూ చేయడంలాంటి అంశాలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కాబోతోంది. పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను రిలీజ్‌ చేసిన యుఎఫ్‌ఓ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని ఈనెల 7న గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. ప్రతి వ్యక్తి జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచే ఫస్ట్‌ లవ్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Spread the love