బాలయ్య ఆశీస్సులే కారణం..

సాయి చరణ్‌, పల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్‌ ఆఫ్‌ ద స్టూడెంట్‌’ అన్నది ఉపశీర్షిక. జిఎల్‌బి శ్రీనివాస్‌ దర్శకత్వంలో కె.ఎల్‌.పి మూవీస్‌ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా రెండోవారం నడుస్తోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో కేక్‌ కట్‌ చేసి బాలయ్య బర్త్‌డేని సెలబ్రేట్‌ చేశారు.
నిర్మాత మాట్లాడుతూ, ‘సరైన థియేటర్లు దొరుకుతాయా లేదా అనే డైలామాలో ఉన్నాం. బాలకష్ణ ట్రైలర్‌ విడుదల చేశాక, మా సినిమాకి క్రేజ్‌ పెరిగింది. 99 థియేటర్లు దొరికాయి. సినిమా కథ జనాలకు బాగా కనెక్ట్‌ అయింది. రెండో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇదంతా బాలయ్య ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. త్వరలో నందమూరి ఫ్యామిలీ హీరోలతో ఓ సినిమా చేస్తా. ప్రసన్నకుమార్‌కి కతజ్ఞతలు. రెండో సినిమా వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’ అని తెలిపారు.

Spread the love