రంగబలి టీజర్‌ అదుర్స్‌..

హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్‌ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. యుక్తి తరేజా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. లేటెస్ట్‌గా మేకర్స్‌ అన్ని ప్రధాన పాత్రలు, బ్యాక్‌డ్రాప్‌ను పరిచయం చేస్తూ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.దూకుడు స్వభావం, లోకల్‌ ఫీలింగ్స్‌ ఉన్న హీరో చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటాడు. తనని అందరూ విమర్శిస్తుంటే హీరోయిన్‌ మాత్రం తను చాలా సాఫ్ట్‌ అని భావిస్తుంది. హీరో తండ్రికి మెడికల్‌ షాప్‌ ఉంది. కానీ హీరోకి మందులకి సంబంధించిన బేసిక్స్‌ కూడా తెలియవు. హీరోయిన్‌ వత్తిరీత్యా డాక్టర్‌. నాగశౌర్య ఈ పాత్రను చాలా ఈజ్‌తో డైనమిక్‌గా పోషించారు. గోదావరి యాసలో డైలాగులు చెప్పి అలరించారు. యుక్తి తరేజా కూల్‌గా కనిపించింది. సత్య, సప్తగిరి, ఇతర హాస్యనటులు తగిన వినోదాన్ని పంచారు. ఇందులో షైన్‌ టామ్‌ చాకో పాత్రను కూడా పరిచయం చేశారు. వినోదం, రొమాన్స్‌తో పాటు యాక్షన్‌ కూడా ఉంటుంది. పవన్‌ బాసంశెట్టి అన్ని కమర్షియల్‌ హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ నిర్మాణ విలువలు గ్రాండ్‌గా ఉన్నాయి. దివాకర్‌ మణి సినిమాటోగ్రఫీ, పవన్‌ సిహెచ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Spread the love