మాతృత్వం గొప్పతనం తెలిపే చిత్రం


నాని మూవీ వర్క్స్‌ అండ్‌ రామా క్రియేషన్స్‌ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్‌ హీరో, హీరోయిన్లుగా రమాకాంత్‌ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్‌ కె.చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.1 చిత్ర పూజా కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నటులు సుమన్‌ స్క్రిప్ట్‌ అందించగా, హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్‌కు నిర్మాత కె.ఎస్‌ రామారావు క్లాప్‌ కొట్టారు. దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసారు. దర్శకులు నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాతలు మాట్లాడుతూ,’ స్త్రీ తల్లి అవ్వడం ఒక అదష్టం. ఆ అదష్టాన్ని సరిగ్గా వినియోగించు కోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ చిత్ర కథాంశం. జూలై మొదటి వారంలో షూటింగ్‌ ప్రారంభించి, సెప్టెంబర్‌లో మూవీ రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’ అని తెలిపారు. దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ,’ఫుల్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్‌తో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పారు. ‘ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని హీరో విశ్వ కార్తికేయ తెలిపారు. హీరోయిన్‌ పాత్రకు చాలా ఇంపార్టెన్స్‌ ఉందని ఆయుషి పటేల్‌ చెప్పారు.

Spread the love