ఇంద్రజాలం మొదలైంది

ఇంద్రసేన హీరోగా, జై క్రిష్‌ మరో ప్రధాన పాత్రలో పూర్ణాస్‌ మీడియా సమర్పణలో నిఖిల్‌ కె. బాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇంద్రజాలం’. బుధవారం ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఇంటర్నేషనల్‌ ఆర్టిట్రేషన్‌ కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ఆర్‌. మాధవరావు కెమెరా స్విచ్ఛాన్‌ చేయడంతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీడియాతో హీరో ఇంద్రసేన మాట్లాడుతూ, ‘నేను నటించిన ‘శాసనసభ’ మూవీ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఆ సినిమా చూసిన నిఖిల్‌ ఈ చిత్రంలో నాకు అవకాశం కల్పించారు’ అని తెలిపారు.
‘ఇది నాకు తొలి ప్రాజెక్ట్‌. ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌తో కూడిన ప్రేమకథ. ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఫస్ట్‌ నుంచీ ఫుల్‌ కామెడీ ఉంటుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటారు. ఒకరిని మాత్రం 10 రోజుల్లో రివీల్‌ చేస్తాం. మరొక హీరోయిన్‌ను చివరి వరకూ సస్పెన్స్‌గానే ఉంచుతాం. రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తవుతుంది. ఒక షెడ్యూల్‌ బొంబాయిలో చేస్తాం. మరొకటి హైదరాబాద్‌లో చేస్తాం. .జూలై మూడో వారం నుంచి షూటింగ్‌కి వెళ్తాం’ అని దర్శక, నిర్మాత నిఖిల్‌ చెప్పారు.

Spread the love