అద్భుతమైన గ్రామీణ నేపథ్య కథ

విగేష్‌ రెడ్డి గవి, శ్రీ ఆశ్రిత కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘రాజా రమ్యం’. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ బుధవారం రిలీజ్‌ చేశారు. ప్రనిల్‌ గౌరీ పాగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఆర్వన్‌ గండికోట కథ, స్క్రీన్‌ ప్లే అందించారు. కోకొండ జయచందర్‌ రెడ్డి, సంజరు రెడ్డి, అనిల్‌ పల్లాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గావి ఫిలిమ్స్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియోస్‌ పై తెరకెక్కిస్తున్నారు
ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఒక విలేజ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో ఇద్దరు విద్యార్థులు సైకిల్‌ మీద కలిసి వెళ్తున్న సన్నివేశాన్ని మనం చూడొచ్చు. రొటీన్‌కు భిన్నంగా ఉన్న ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ద్వారా మనం ఒక అద్భుతమైన విలేజ్‌ డ్రామాను చూడబోతున్నాం అనే విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక అద్భుతమైన కథను ప్రేక్షకులకు ఈ సినిమా అందించనుంది.
ఈ మధ్యకాలంలో వచ్చిన ఎన్నో సినిమాలు రూరల్‌ డ్రామాలు కాగా, అదే కోవకు చెందిన ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
ఈ చిత్రానికి సంగీతం : చరణ్‌ అర్జున్‌, ఎడిటర్‌ : ప్రదీప్‌ ఆర్‌ మోరం, డీ ఓ పి : ప్రవీణ్‌ కె బంగారి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : కిరణ్‌ రామానుజం, ఆర్ట్‌ : వెంకటేష్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ : ప్రసాద్‌ బిల్లకుర్తి, కొరియోగ్రాఫర్‌ : మోహన్‌ కష్ణ, డైలాగ్స్‌ : అనిల్‌ మల్లెల, వి.సూర్య, సాహిత్యం : చరణ్‌ అర్జున్‌, లక్ష్మీ ప్రియాంక.

Spread the love