దసరా కానుక

నందమూరి బాలకష్ణ, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రధాన తారాగణంపై మేకర్స్‌ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. మేకర్స్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ లతో అటు బాలయ్య అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు బ్యాక్‌ టు బ్యాక్‌ ట్రీట్‌లను అందజేస్తున్నారు. టైటిల్‌ను విడుదల చేసిన అనంతరం టీజర్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసిన మేకర్స్‌, ఇందులో కథానాయికగా నటిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో కాజల్‌ లుక్‌ అందర్నీ అలరిస్తోంది. ఈ చిత్రంలో అర్జున్‌ రాంపాల్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. విజయదశమి (దసరా)కి థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్‌ పెద్ది, సంగీతం: ఎస్‌ థమన్‌, డీవోపీ: సి రామ్‌ ప్రసాద్‌, ఎడిటర్‌: తమ్మి రాజు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవ్‌, ఫైట్స్‌: వి వెంకట్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌ కష్ణ.

Spread the love