అర్జున్ సర్జా, రాధిక కుమారస్వామి, జె.డి.చక్రవర్తి, ఫైజల్ ఖాన్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరు’. ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు.
ఎస్.ఎస్ సమీర్ దర్శకుడు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ముషీరా బాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ప్రసన్నకుమార్, తీన్మార్ మల్లనతోపాటు చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొని సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు ఎస్.ఎస్ సమీర్ మాట్లాడుతూ, ‘ప్రజెంట్ జనరేషన్‌కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. అర్జున్, జె.డి.చక్రవర్తి ఈ కథకు యాప్ట్ అయ్యారు. యాక్షన్‌తోపాటు చక్కని వినోదాన్ని పంచే సినిమా ఇది. నిర్మాత సహకారం మరువలేనిది’ అని అన్నారు. ‘సినిమాలో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది చివరి వరకూ గెస్ చేయలేరు. క్లైమాక్స్ సినిమాకు హైలైట్ అవుతోంది. మంచి టాక్‌తో హిట్ అవుతుందని ఆశిస్తున్నాం’ అని నిర్మాత చెప్పారు. నటుడు సమీర్ మాట్లాడుతూ, ‘దర్శకుడు మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశారు. అవుట్‌పుట్ చూసిన అందరూ సినిమా హిట్ అని అంటున్నారు’ అని తెలిపారు.