యుఎస్‌ఎలో పీపుల్‌ సినిమాస్‌ రిలీజ్‌

పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ తొలి కాంబినేషన్‌లో పి.సముద్రఖని దర్శకత్వం వహించిన సినిమా ‘బ్రో’. ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌, సహనిర్మాత వివేక్‌ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ఈ సినిమాకు తెలుగులో దర్శకుడు, రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నారు.
ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఎన్నో అంచనాలను క్రియేట్‌ చేసిన ఈ ఈ చిత్రాన్ని యుఎస్‌ఎలో ‘పీపుల్‌ సినిమాస్‌’ రిలీజ్‌ చేయనుంది.
ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. అలాగే ఫస్ట్‌ లుక్‌కి, రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌తో టీజర్‌ వైరల్‌ అయ్యింది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్‌, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు, పధ్వి రాజ్‌, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: సుజిత్‌ వాసుదేవ్‌, సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌, ఆర్ట్‌: ఏ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ఫైట్స్‌: సెల్వ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం.

Spread the love