ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు

కేరళలో రీసెంట్‌ టైమ్స్‌లో ఇండిస్టీ హిట్‌గా నిలబడిన చిత్రం ‘2018’. ఈ చిత్రం శుక్రవారం తెలుగులో విడుదల అయింది. నిర్మాత బన్నీ వాసు తెలుగు ప్రేక్షకులకు అందించిన ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, ‘పబ్లిసిటికి ఎక్కువ టైం లేకపోయినా నేను నమ్మింది ఒకటే.. ఇందులో ఉన్న కంటెంట్‌ మనిషి హృదయాన్ని కదిలిస్తుందని. ఇప్పటివరకు దాదాపు 17 సినిమాల వరకు తెలుగులో ప్రొడ్యూస్‌ చేసాను. కానీ ఈ సినిమా నాకు ఒక ఎక్స్ట్రా లేబుల్‌ ఇచ్చింది. కేరళలో మా ‘గీత గోవిందం’ని రిలీజ్‌ చేసి, వచ్చిన ఫండ్స్‌ను అక్కడ వరదల టైంలో ఫండ్‌గా ఇచ్చాము’ అని తెలిపారు. ‘మా సినిమాని ఆదరిస్తున్న తెలుగు ఫిల్మ్‌ ఇండిస్టీకి చాలా కృతజ్ఞతలు. బన్నీవాసు గారు 63 లక్షలు 2018లో కేరళకి ఫండ్స్‌ ఇచ్చారు’ అని దర్శకుడు జ్యూడ్‌ ఆంటోని అన్నారు. హీరో టోవినో థామస్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాను ఊహించని స్థాయిలో రిసీవ్‌ చేసుకున్నందుకు చాలా థ్యాంక్యూ. ఈ సినిమాకి కేరళలో మాత్రమే కాకుండా అన్నిచోట్లా కూడా మంచి రెస్పాన్స్‌ వస్తుంది’ అని అన్నారు.

Spread the love