ఆద్యంతం వినోద భరితం..

throughout entertainment Bharatham..సంతోష్‌ శోభన్‌ హీరోగా, రాశీ సింగ్‌, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్‌ కుమార్‌’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై శివ ప్రసాద్‌ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రైటర్‌ అభిషేక్‌ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈనెల 18న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత శివ ప్రసాద్‌ పన్నీరు మీడియాతో మాట్లాడుతూ, ‘డిఫరెంట్‌ బ్యాగ్రౌండ్‌ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. పెళ్లి అనేది స్క్రిప్ట్‌లో ఓ భాగం మాత్రమే. మన సినిమాల్లో హీరో హీరోయిన్‌ పెళ్లి సమయంలో పారిపోవటమే, ఫైట్‌ చేసి కలిసిపోవటమే జరుగుతుంటుంది. అది ఎక్కువగా హీరో, హీరోయిన్స్‌ కోణంలోనే చూపిస్తూ వచ్చారు. మరి పెళ్లి పీటల మీదున్న పెళ్లి కొడుకు పాయింట్‌ను ఎవరూ చూపించలేదు. ఉన్నా ఏవో ఒకట్రెండు సినిమాల్లోనే చూసుంటారు. ఆ పాయింట్‌ నాకు ఆసక్తికరంగా అనిపించింది. పెళ్లి ఆగిపోయినప్పుడు ఆ యువకుడు మానసికంగా ఎలాంటి బాధను అనుభవిస్తాడు. అతని కుటుంబానికి వచ్చే సమస్యలు ఏంటి? అనే దాన్ని ఎంటర్‌టైన్మెంట్‌ యాంగిల్‌లో చూపించాం. సంతోష్‌ కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుందని నమ్ముతున్నాను. హీరోయిన్స్‌ రాశీ సింగ్‌, రుచిత సాధినేని అద్భుతంగా నటించారు. దర్శకుడు అభిషేక్‌ అనుకున్న దానికంటే బాగా తెరకెక్కించారు. మేం నా ఫ్యామిలీ మెంబర్స్‌, సన్నిహితులతో కలిసి సినిమా చూశాం. అందరికీ సినిమా చాలా బాగా నచ్చింది’ అని తెలిపారు.

Spread the love