పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

మైక్‌ మూవీస్‌ బ్యానర్‌ పై వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తూ అభిరుచి గల నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి, రవీందర్‌ రెడ్డి సజ్జల. ఈ ముగ్గురూ నిర్మించిన మరో న్యూ కాన్సెప్ట్‌ మూవీ ‘మిస్టర్‌ ప్రెగెంట్‌’. శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వంలో సయ్యద్‌ సోహైల్‌ రియాన్‌, రూపా కొడవాయుర్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలవు తోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ డిస్ట్రిబ్యూషన్‌ రిలీజ్‌ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయిన సందర్భంగా నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి, రవీందర్‌ రెడ్డి సజ్జల మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ, ‘ఇటీవల మా సంస్థలో వచ్చిన స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌, ఇప్పుడు ఈ సినిమా అయినా అలా కొత్తదనం ఉన్న స్క్రిప్ట్‌ను నమ్మే నిర్మించాం. ఈ కథలో మదర్‌ సెంటిమెంట్‌ బాగా నచ్చింది. అయితే మేల్‌ పెగెన్సీ నేపథ్యం కాబట్టి ఇండిస్టీలో కొందరు స్నేహితులు ఇది కత్తి మీద సాము లాంటి సినిమా అని చెప్పారు. ఇది ఛాలెంజింగ్‌ స్క్రిప్ట్‌. మేము కూడా అలాగే తీసుకుని చేశాం. మేము సినిమా చూశాం. అవుట్‌ఫుట్‌ మేం ఎక్స్‌పెక్ట్‌ చేసినట్లే వచ్చింది. ఇటీవల మైత్రి డిస్ట్రిబ్యూషన్‌ వాళ్లు చూశారు. సినిమా చాలా బాగుందని చెప్పారు. దాంతో మా కాన్ఫిడెన్స్‌ మరింత పెరిగింది. శ్రావణ్‌ భరద్వాజ్‌ మ్యూజిక్‌ మా సినిమాకు ఆకర్షణ అవుతుంది’ అని తెలిపారు.
‘మా సంస్థలో ఇప్పటిదాకా నాలుగు సినిమాల్ని సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్‌ చేశాం. ఇందులో ఎమోషన్‌ను సొహైల్‌ ఇంప్రెసివ్‌గా చూపించాడు. ఈ సినిమాతో తనకి మంచి పేరొస్తుంది. మేల్‌ ప్రెగెంట్‌ క్యారెక్టర్‌ను ఎంతో సహజంగా చేశాడు. ఈ సినిమాను కమర్షియల్‌ మూవీ ఫార్మేట్‌లో చూడకూడదు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎవరికి వారిని వ్యక్తిగతంగా ఆలోచింపజేసే చిత్రమవుతుంది’ అని మరో నిర్మాత వెంకట్‌ అన్నపరెడ్డి అన్నారు.
నిర్మాత రవీందర్‌ రెడ్డి సజ్జల మాట్లాడుతూ, ‘ఈ సినిమా ట్రైలర్‌ను నాగార్జున విడుదల చేయడంతో మంచి బూస్టింగ్‌ వచ్చింది. ట్రైలర్‌కు రెస్పాన్స్‌ బాగుండటంతో మూవీ మీద బజ్‌ ఏర్పడింది. ఇలాంటి కథతో తెలుగులో మూవీ రాలేదు. కామెడీ మీద బేస్‌ అయి ఉంటుంది. ఇది యూనిక్‌గా ఉండే సినిమా. ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌ మెంట్‌తో సినిమాను ఎంజారు చేస్తారు’ అని చెప్పారు.

Spread the love