– జెండా ఆవిష్కరించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ జీజే.రావు
– పాల్గొన్న ప్రజరు గ్రూప్ ఎండీ రోహిత్ రెడ్డి, ప్రముఖ సైకాలజిస్ట్ ఎం.శ్రీనివాసరావు
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
77వ స్వతంత్ర వేడుకలు సెలబ్రిటీ రిసార్ట్లో ఘనంగా నిర్వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ గా పదవీ విరమణ చేసిన జీజే రావు జెండావిష్కరణ చేసి సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత జాతీయ స్వాతంత్రం కోసం జరిగిన సంగ్రామాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాలని, ఆ ఫలితాలు ప్రజలం దరికీ చేరేలా ప్రతి ఒక్కరూ కషి చేయాలని కోరారు. స్వాతంత్ర సంగ్రామంలో ఎంతోమంది అమరులయ్యారని, ఎన్నో రకాల కష్టనష్టాలను ఎదుర్కొని స్వాతంత్ర సమపార్జనకు కషి చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. భారత స్వాతంత్రం సాధనలో అమరులైన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవడంతోపాటు దేశం కోసం కషి చేసిన వారిలాగా కషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా ప్రజరు రిసార్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సిబ్బంది ఐక్యంగా కషి చేయడం ద్వారా మాత్రమే తాము ఈ స్థాయిలో నిలబడుతున్నామని, వారి కషి మరువలేనిదని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి బహుమతులు అందజేశారు. తమ సిబ్బంది కషి, త్యాగనిరతి వల్లే తమ సంస్థ పైన నమ్మకం ఉంచి పెద్ద సంఖ్యలో తమ రిసార్ట్ కు వినియోగదారులు వస్తున్నారని వారందరినీ ఆనందంలో ముంచెత్తడం ద్వారా సిబ్బంది సంతప్తి చెందుతున్నారని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. 75 రూమ్స్ తో పాటు 350 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 220 మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారని, తమ రిసార్ట్ లో కార్పొరేట్ ట్రైనింగ్, పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు, ప్రీ వెడ్డింగ్ షఉట్ లు, సినిమా షఉటింగ్ తో పాటు, హౌలీ దాండియా, నవరాత్రి సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటుచేసిన సిబ్బంది ట్రైనింగ్ లో పాల్గొన్న ప్రముఖ సైకాలజిస్ట్ మహీపతి శ్రీనివాసరావు అనేక అంశాలలో ప్రతిభ కనబరచాలంటే సిబ్బంది ఏ విధంగా పనిచేయాలో సూచనలు చేశారు. ఉద్యోగం చేయడం అంటే కేవలం ఉద్యోగంలా మాత్రమే కాకుండా ఇష్టంగా, సంతప్తికరంగా మన సొంత పనుల మాదిగ పనిచేసినప్పుడే ఉద్యోగంలో విజయవంతం అవుతారని తద్వారా సొసైటీ అభివద్ధిలో కూడా భాగమవుతారని తెలిపారు. వినియోగదారుడే మన ప్రథమ పౌరుడు అనే మాదిరిగా వినియోగదారుడి అవసరాలను పూర్తిస్థాయిలో గుర్తించి తదనుగుణంగా సేవలందించడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించవచ్చని సూచించారు. వినియోగదారులు సంతప్తి చెందితే తమతో పాటు బంధుమిత్రులు, స్నేహితులు వంటి వారితో పంచుకొని మన సేవలను గుర్తించుకొని తిరిగి మన రిసార్ట్ కి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అలాగే సెలబ్రిటీ రిసార్ట్స్ జనరల్ మేనేజర్ హరి జోసెఫ్ మాట్లాడుతూ వినియోగదారుల సంతప్తే తమ లక్ష్యంగా పనిచేస్తున్న క్రింది స్థాయి సిబ్బంది నుండి పై స్థాయి సిబ్బంది వరకు అందరినీ పేరుపేరునా అభినందిస్తున్నామని, అలాంటి కషి చేస్తేనే వినియోగదారులు ఎక్కువ సంఖ్యలో తమను గుర్తిస్తారని ఆ రకంగా ప్రతి ఒక్కరూ వినియోగదారులకు సేవలు అందించడంలో సంతప్తికరంగా ఓపికతో సేవలు అందించడం అనేది గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో షామీర్పేట తహసిల్దార్ సత్యనారాయణ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిబ్బంది తోపాటు సెలబ్రిటీ రిసార్ట్స్ లో వివిధ విభాగాల అధిపతులు సిబ్బంది పాల్గొన్నారు.