అంత్యక్రియలకు టీఆర్‌ఆర్‌ ఆర్థికసాయం

The funeral was financed by TRRనవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని గుండాల్‌ గ్రామానికి చెందిన మున్నూరు వెంకటమ్మ సోమవారం మృతిచెందింది. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రామ్మోహన్‌ రెడ్డి, స్థానిక నాయకుల ద్వారా బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 వేలు ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో గుండాల కాంగ్రెస్‌ గ్రామ సీనియర్‌ నాయకుడు పి ప్రభాకర్‌ రెడ్డి, కే జగన్నాథ్‌ రెడ్డి, మండల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రామ్‌ గోవర్ధన్‌ రెడ్డి, హౌటల్‌ బాలప్ప, యువ నాయకులు పి.రామచంద్రారెడ్డి, రాకేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో కొజ్జా అంజిలమ్మ మృతిచెందింది. విషయం తెలుసు కున్న ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి, తన అనుచరుల ద్వారా బాధిత కుటం బానికి రూ.5 వేలు అందజేశారు. కార్యక్రమంలో ఇక్కి సురేందర్‌, డప్పు చంద్రశేఖర్‌, వార్డ్‌ మెంబెర్‌ డప్పు రమేష్‌, ఇక్కి వెంకటేష్‌, కొమ్ముగాళ్ల నరేష్‌, ఈరారపు వెంకటయ్య, ఇక్కి వెంకట్‌, జంగయ్య పాల్గొన్నారు.

Spread the love