– ఏఎంసీ చైర్మెన్ ప్రశాంత్ గౌడ్
నవతెలంగాణ-నవాబుపేట్
మండల పరిధిలోని అక్నాపూర్‌లో 35 ఏండ్లుగా ప్రభుత్వ పాఠశాలలో వృత్తిరీత్యా ప్రయివేట్ అటెండర్ గా పనిచేస్తు గ్రామస్తుల మన్ననలు పొందారు. అక్షరాలు మొదలుకొని ఆటపాటలు అన్నీ తానై విద్యా ర్థులకు మొదటి గురువుగా అయ్యారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, వివిధ రంగాలలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రయివేటు ఉద్యోగులు సత్యన్నకు మంగ ళవారం వీడుకోలు సమావేశం ఏర్పారు చేశారు. ఏఎం సి చైర్మెన్ ప్రశాంత్ గౌడ్ సత్యన్నకు రూ. 20 వేలు ఆర్థికసాయం అందించారు. కార్యక్రమానికి మం డల ఏఎంసీ చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఆయన మాట్లాడుతూ…అటెండర్‌గా వచ్చిన సత్తయ్య చేసిన సేవలు వెలకట్టలేనివని గ్రామస్తులు అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తలారి అజరు కుమార్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వార్డు మెంబర్లు చంద్రయ్య గౌడ్, రాజు, రమేష్, బానూరి నర్సిములు, బేగరి దేవదాస్, తలారి ఆశీర్వాదం, సర్వర్ ఖాన్, గ్రామ పెద్దలు యువజన సంఘ నాయకులు తదితరులున్నారు.