– చైర్మన్ బిలకంటి శేఖర్‌రెడ్డి
– 10/10 సాధించిన విద్యార్థికి రూ.25వేల ఆర్థిక సాయం
నవతెలంగాణ-యాచారం
ప్రభుత్వ పాఠశాలల్లో బాగా చదివే పేద విద్యార్థులకు బీ.ఎన్.రెడ్డి ట్రస్ట్ చేయూతను అందిస్తుందని చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని నందివనపర్తి జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాలలో పదిలో 10/10 శాతం సాధించిన ముచ్చర్ల సాయికిరణ్‌ను సన్మానించి, బి.ఎన్. రెడ్డి ట్రస్ట్ తరపున రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులంతా చిన్నతనం నుంచే ఒక లక్ష్యంతో చదవాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల ్లలను ఉన్నతమైన స్థానంలో చూడాలని కలలు కంటారని, ఆ కలలను విద్యార్థులు సహకారం చేసే విధంగా ముందుకెళ్లాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన సాయికిరణ్ పదికి పది శాతం సాధించి, మండలంలోని గ్రామానికి మంచి పేరు తెచ్చారని అభినందించారు. ఆయన పై చదువులకు సంబంధించి బి.ఎన్.రెడ్డి ట్రస్టు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంబాళ్లపల్లి ఉదయశ్రీ, పంచాయతీ కార్యదర్శి శ్యాం సుందర్, పాఠశాల హెచ్‌ఎం కిషన్ నాయక్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.