జేబీఐటీలో మేరీ మట్టి మేరా దేశ్‌ కార్యక్రమం

నవతెలంగాణ-మొయినాబాద్‌
జేబీఐఈటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మేరీ మట్టి మేరీ దేశ్‌ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీసీ కృష్ణమాచారి మొక్కలను నాటినట్టు కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ ఎన్‌.తిరుపతిరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఈవో డాక్టర్‌ మేజర్‌ జనరల్‌ జూనియర్‌ ఆర్సీ. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకట రమణారెడ్డి, క్యాంపస్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌రెడ్డి, సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ శ్రీ యుగంధర్‌ రెడ్డి, టీం స్టూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌ కార్తికేయన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ శ్రీ విగేష్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌ సత్యనారాయణ, ఎన్‌ఎస్‌ఎస్‌ స్టూడెంట్స్‌ వాలంటర్స్‌ ప్రవీణ్‌ కుమార్‌, తపస్వి పాల్గొన్నారు.

Spread the love