శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భాగ్ సాలే’. నేహా సోలంకి నాయిక. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్‌తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. ఈనెల 7న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రణీత్ బ్రాహ్మాండ పల్లి మీడియాతో మాట్లాడుతూ, ‘ఇదొక కల్పిత కథ. నిజాంకి ఉంగరాల పిచ్చి ఉందని అంటారు. అందుకే హైదరాబాద్ బ్యాక్ గ్రౌండ్‌ని ఎంచుకున్నాను. పూర్తిగా క్రైమ్ కామెడీ జోనర్‌లోనే ఉంటుంది. కామెడీ చాలా బాగా వచ్చింది. అన్ని పాత్రలు నవ్విస్తాయి. వర్షిణి ఓ ఫ్రస్టేటెడ్ అమ్మాయిలా కనిపిస్తుంది. నేహా సోలంకి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ పాత్రలో నటించింది. శ్రీసింహాది అయితే కిలాడి లాంటి పాత్ర (నవ్వుతూ). ఈ సినిమాలో అంతా పరిగెత్తడమే ఉంటుంది. అందుకే భాగ్ సాలే అనే టైటిల్ సౌండింగ్ బాగుందని పెట్టాం. కాలభైరవ ఈ చిత్రానికి కనిపించని హీరో. అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. రామకష్ణ మాస్టర్ మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. మా నిర్మాత అర్జున్ ఎంతో సపోర్ట్‌గా నిలిచారు’ అని చెప్పారు.