డిసెంబర్‌లో విడుదల

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్‌’. టైటిల్‌ పాత్రలో యువ గాయకుడు కృష్ణ చైతన్య, ఆయన భార్య సావిత్రి పాత్రలో మదుల నటించారు. అన్యుక్తరామ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పతాకంపై శ్రీమతి ఫణి నిర్మాతగా, గాయకుడు జి.వి భాస్కర్‌ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. సి.హెచ్‌.రామారావు దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర పోస్టర్‌ను ఫిల్మ్‌ ఛాంబర్‌లో నిర్మాత సి.కల్యాణ్‌ ఆవిష్కరించారు. కష్ణచైతన్య మాట్లాడుతూ, ‘ఘంటసాల పాత్ర పోషించడం ఓ గాయకుడిగా నాకు దక్కిన అదష్టంగా భావిస్తున్నా’ అని అన్నారు.
నిర్మాణ సారథి జి.వి.భాస్కర్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్ర టీజర్‌ను ఎస్‌.పి.బాలు విడుదల చేశారు. దానికి మంచి ఆదరణ లభించింది’ అని చెప్పారు. ‘ఈ సినిమా పెద్ద స్థాయిలో జనాలకు చేరువవుతుంది’ అని సమర్పకులు లక్ష్మీ ప్రసాద్‌ చెప్పారు. ‘దర్శకుడిగా నా మొదటి చిత్రమిది. నేను అభిమానించే ఘంటసాల జీవిత కథతో సినిమా తీసే అవకాశం రావడం నా అదష్టం. ఘంటసాల గాయకుడి కన్నా వ్యక్తిగతంగా ఎంతో మంచి మనిషి. ఆయన జీవితంతో ఎంత పోరాటం చేశారు’ అని దర్శకుడు సిహెచ్‌ రామారావు తెలిపారు.

 

Spread the love