అదృష్టంగా భావిస్తున్నా

హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్‌ బాసంశెట్టి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘రంగబలి’. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 7న విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్‌ యుక్తి తరేజ మీడియాతో మాట్లాడుతూ, ‘మాది హర్యాన. ఢిల్లీ యూనీవర్శిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. కాలేజీలో ఉన్నప్పుడే డ్యాన్స్‌ స్కూల్‌లో జాయిన్‌ అయ్యాను. చాలా డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొన్నాను. అలాగే ఢిల్లీ ఫ్రెష్‌ ఫేస్‌ కాంపిటీషన్‌లో విన్‌ అయ్యాను.
తర్వాత మోడలింగ్‌ మొదలుపెట్టాను. తర్వాత యాక్టింగ్‌ ఆడిషన్స్‌ ఇచ్చాను. ‘లుట్‌ గరు’ అనే పాట మంచి పేరు తీసుకొచ్చింది. అలా సినిమా జర్నీ మొదలైయింది. దర్శకుడు పవన్‌ ఈ సినిమాలో పాత్ర కోసం ఆడిషన్స్‌ చేశారు. మొదట లుక్‌ టెస్ట్‌ జరిగింది. తర్వాత రెండు సీన్స్‌ ఇచ్చి నటించమని చెప్పారు. ఈ పాత్రకు నేను సరిపోతానని నమ్మకం కుదిరిన తర్వాతే ఎంపిక చేశారు. ఇది నా మొదటి తెలుగు సినిమా. నా మొదటి సినిమాకే నాగశౌర్యతో పాటు మంచి నిర్మాణ సంస్థలో పని చేయడం అదష్టంగా భావిస్తున్నాను. ఇందులో మెడికల్‌ స్టూడెంట్‌గా కనిపిస్తా. నా పాత్ర పేరు సహజ. చాలా కూల్‌ క్యారెక్టర్‌. పేరుకి తగ్గట్లే చాలా నేచురల్‌గా ఉంటుంది. నాగశౌర్య చేసిన సినిమాల గురించి తెలుసు. ఆయన సినిమాల్లో పాటలు విన్నాను. ఆయనతో వర్క్‌ చేయడం గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. దర్శకుడు పవన్‌ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. తెలుగులో నా ఫేవరేట్‌ హీరో అల్లు అర్జున్‌. ఆయన డాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఇక హీరోయిన్‌ అనుష్కశెట్టి కూడా చాలా ఇష్టం’ అని చెప్పారు.

Spread the love