‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఓ పాట పాడారు. ఈ సినిమాలో ధనుష్ పాడిన 2వ పాట ‘హతవిధి’ ఈనెల 31న విడుదల కానుంది. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.
‘హతవిధి’ పాట అనౌన్స్‌మెంట్ కోసం హీరో నవీన్ పోలిశెట్టి రిలీజ్ చేసిన ఫన్నీ వీడియో అందర్నీ విశేషంగా అలరిస్తోంది. ఈ చిత్రంలోని ఓ పాట పాడేందుకు నవీన్ పోలిశెట్టి చేసిన హంగామా ఏమిటో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆయనకి బదులు ధనుష్ ఈ పాట పాడిన విధానం అందర్నీ బాగా నవ్విస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు.పి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లోనూ విడుదల కానుంది.