స్థానిక సమస్యలపై పోరాటాలు నిర్వహించాలి

ప్రజలకు అండగా నిలబడాలి
సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ – ఎర్రుపాలెం
రాష్ట్రవ్యాప్తంగా గూడు లేక నిరుపేదలు నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వాలు పెత్తందారులకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అండగా నిలుస్తున్నారని, ఇంటి జాగాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని పోరాటాలు చేస్తున్నా పాలకులు పెడచెవిన పెడుతున్నారని స్థానికంగా ప్రజల సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మధిర నియోజకవర్గ ఇన్చార్జి పాలడుగు భాస్కర్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భీమవరం గ్రామంలో జోన్‌ కమిటీ సమావేశం గొల్లపూడి కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పేదలు ప్రభుత్వ భూమిని ఎంచుకొని భూ పోరాట మార్గాన్ని అనుసరిస్తున్నారని, వారికి సిపిఎం మద్దతు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఇళ్ల కోసం ఇంటి జాగాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించబడుతున్నాయని, ప్రభుత్వ జాగాలలో గుడిసెలు వేసుకు నేందుకు పేదలు సిద్ధమవుతున్నారని అన్నారు. మండలంలో ప్రభుత్వ భూములు కలిగి ఉంటే ఇల్లు లేని నిరు పేదలు జెండాలు పాతుకునే విధంగా నాయకులు వారిని సిద్ధ పరచాలని అన్నారు. పెన్షన్‌ రాని వృద్ధులకు పెన్షన్‌ కోసం, రేషన్‌ కార్డులు కోసం, పెండింగ్‌ పాస్‌ పుస్తకాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పార్టీ నాయకులు అలు పెరుగని కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఖాళీ గా ఉన్న 40 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి దివ్యల వీరయ్య, నల్లమోతు హనుమంతరావు, మేడగాని తిరుపతిరావు, బేతి శ్రీనివాసరావు, షేక్‌ లాల, అనుమోలు వెంకటేశ్వరరావు, యనమల వెంకట నారాయణరెడ్డి, షేక్‌ జానీ, తేనె రాజారావు, మందడపు ప్రభాకర్‌రావు, కోలా వెంకట నారాయణ, కోట వెంకటేశ్వర్లు, బాలసౌరి, శ్రీ హరి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love