సంయుక్త కిసాన్ మోర్చా ఆద్వర్యం స్వతంత్ర దినోత్సవం

నవతెలంగాణ – అశ్వారావుపేట
సంయుక్త కిసాన్ మోర్చా ఆద్వర్యంలో 76 స్వతంత్ర దినోత్సవాన్ని మంగళవారం స్థానిక మూడు రోడ్ల కూడలిలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ 76 ఏండ్లు స్వపరిపాలన లోనూ భారత సమాజం అధిక ధరలు,పేదరికాన్ని అధిగమించ లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.నాడు విదేశీ వ్యాపారుల పై పోరాటం చేసి స్వతంత్రం సాధించు కుంటే నేటి పాలకులు స్వదేశీ వ్యాపారులకు ప్రజా వనరులను దారాదత్తం చేస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చిరంజీవి, రైతు నాయకులు ఆలపాటి రాంమోహన్ రావు(రాము),జూపల్లి రమేష్,క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love