లెక్క తప్పుతున్న పాఠశాల విద్య…

– ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
– అత్యధికులు గణితంలో పల్టీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
గుణాత్మక విద్య ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యా విధానం లెక్క తప్పుతుంది ఏమో అనిపిస్తుంది. ఇటీవల విడుదల అయిన పది ఫలితాల్లో ఫెయిల్ విద్యార్ధులు అత్యధికం గణితంలో నే పల్టీ కొట్టడం అనేక అపోహలకు తావు ఇస్తుంది. గణితంలో తప్పిన విద్యార్ధులు సైన్స్ లోనూ తిప్పాలి ఎందుకంటే గణితం మాదిరే సైన్స్ సైతం కాస్తా కష్టతరం అయిన సబ్జెక్టు కానీ గణితం తర్వాత రెండో స్థానంలో సాంఘీక శాస్త్రం (సోషల్ సబ్జెక్టు) తప్పిన వారు ఉండటం అనుమానాలకు తావు ఇచ్చినట్లు అనిపిస్తుంది.
అయితే ఈ సారి పరీక్షలకు ఒకటే పేపరు ఉండటం, పేపరు వెయిటేజీ నమూనా సైతం కొత్తది కావడంతో విద్యార్ధులు మార్కులు స్కోర్ చేయలేకపోయారు అనే వాదనా వినిపిస్తుంది.సోషల్ సబ్జెక్టు పరీక్షా పేపరులో పాఠ్యాంశాల్లో ప్రశ్నలు కాకుండా జనరల్ ప్రశ్నలు అడగడం కూడా ఓ సమస్య గా పలువురు సీనియర్ ఉపాద్యాయులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 18 పాఠశాలలకు 529 పరీక్షలు రాయగా 479 మంది ఉత్తీర్ణత సాధించారు.50 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో గణితం లో 26, సోషల్ స్టడీస్ లో 20, తెలుగులో 06, ఆంగ్లంలో 03,సైన్స్ లో 01 చొప్పున విద్యార్ధులు ఫెయిల్ అవడం బాధాకరం.
పాఠశాలలు వారీగా జెడ్.పి.ఎస్.ఎస్ మామిళ్ళ వారిగూడెం, ఎ.హెచ్.ఎస్ పెద్దవాగు ప్రాజెక్టు 11, ఎ.హెచ్.ఎస్ సున్నం బట్టి 08, జెడ్.పి.ఎస్.ఎస్ అశ్వారావుపేట (బి), నారాయణపురం 03, జెడ్.పి.ఎస్.ఎస్ అశ్వారావుపేట( జి),ఎ.జి.హెచ్.ఎస్ అనంతారం 02, జెడ్.పి.ఎస్.ఎస్ అచ్యుతాపురం,గుమ్మడవల్లి,ఎ.జి.హెచ్.ఎస్ భీముని గూడెం 01 చొప్పున ఫెయిల్ అయ్యారు.విద్యార్ధులు మేధో లేమా, ఉపాధ్యాయులు బోధన వైఫల్యం మా, లేక సరిపడా సబ్జెక్టు వారీ ఉపాద్యాయులు లేకపోవడం మా ఏది ఏమైనా ఈ ఫలితాలు మాత్రం పాఠశాల విద్యా పనితీరును మెరుగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుపుతున్నాయి. సబ్జెక్టులు వారీగా ఫెయిల్ వివరాలు.

సబ్జెక్టు    ఫెయిల్
గణితం 26
సోషల్ స్టడీస్ 20
తెలుగు 06
ఆంగ్లం 03
సైన్స్ 01
మొత్తం 56

                     

Spread the love