– భార్య భర్తల భౌతిక గాయాలను సందర్శిస్తున్న నివాళులర్పిస్తున్న జడ్పిటిసి దృశ్యం
– భార్య మృతదేహాన్ని చూసి భర్త మృతి
నవతెలంగాణ – కల్లూరు
భార్యాభర్తల బంధం నూరేళ్లు ఆ బంధం చావులో కూడా విడదీయరాన్ని బంధంగా మారి భార్యాభర్తలిద్దరూ ఒకేరోజు ఒకరి తర్వాత ఒకరు మృతి చెంది బంధం వీడదని నిరూపించిన ఘటన కల్లూరు మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామంలో రాయల అప్పయ్య (103) రాయల తిరుపతమ్మ (96) అను వృద్దదంపతులు ఎంతో ప్రేమ ఆప్యాయతలతో జీవనం సాంగించారు. రెండురోజుల క్రితం భార్య తిరుపతమ్మకు గుండెపోటు రాగ ఖమ్మం హాస్పిటల్ కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. భార్య మృతదేహాన్ని చండ్రుపట్లలోని వారి స్వగృహనికి తీసుకురాగా, భార్య మృత దేహాన్ని చూసి గుండె పగిలేలా ఏడ్చిన భర్త అప్పయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే సారి భార్యాభర్తలిద్దరూ మృతి చెందటంతో చండ్రుపట్ల గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషియం తెలుసుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తీవ్ర సంతాపం తెలియజేశారు. కుమారుడు రాయల కృష్ణయ్య, మనవళ్లు రాయల సాయిబాబు, రాయల పుల్లారావు, రాయల రమేష్ మరియు కుటుంబ సభ్యులను ఓదార్చారు. భౌతికకాయాన్నికి నివాళులర్పించిన వారిలో జడ్పిటిసి కట్టా అజయ్ కుమార్ ఏఎంసి వైస్ చైర్మన్ కాటమనేని వెంకటేశ్వరరావు, సర్పంచ్ గొల్లమందల ప్రసాద్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆనంద్ భాస్కర్, ఫీల్డ్ ఆఫీసర్ శేశారెడ్డి, వల్లభనేని శ్రీనివాసరావు, వల్లభనేని రవి, దొడ్డపనేని రవి, పుసులూరి శ్రీనివాసరావు, పైళ్ళ రాధాకృష్ణ, పైళ్ళ విశ్వనాథం, పైళ్ళ రామారావు, ఫైళ్ళ థామస్,. బి అర్ ఎస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.