పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటారు. యువ దర్శకులు, వైవిధ్యమైన కథలతో ఆయన చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. లేటెస్ట్‌గా ఆయన ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ చిత్రానికి సైన్‌ చేశారు. కళ్యాణ్‌ రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్‌ చేశారు. ‘అలా ఎలా’ అనే ఫీల్‌ గుడ్‌ రొమ్‌-కామ్‌ని తెరకెక్కించిన అశోక క్రియేషన్స్‌ ఈ భారీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. కళ్యాణ్‌రామ్‌ నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ (ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌) బ్యానర్‌తో ఈ బ్యానర్‌ కలిసి పని చేస్తోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌ క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ నెం:2గా అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ చిత్రం కోసం ప్రముఖ తారాగణం, ప్రతిభావంతులైన సాంకేతిక బందం పని చేస్తోంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ కోసం రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో కళ్యాణ్‌ రామ్‌ తన పంచ్‌ పవర్‌ను చూపించే మాస్‌-ఆపీలింగ్‌ ఇదొక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాకుండా సినిమా గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తోంది. కళ్యాణ్‌ రామ్‌ని మునుపెన్నడూ చూడని యాక్షన్‌-ప్యాక్డ్‌ అవతార్‌లో చూపించడానికి ప్రదీప్‌ చిలుకూరి ఆకట్టుకునే కథను రాశారు.
‘డెవిల్‌’ తర్వాత కళ్యాణ్‌ రామ్‌ చేస్తున్న ప్రాజెక్ట్‌ ఇదే. హరికష్ణ భండారి ఈ చిత్రానికి స్క్రీన్‌ ప్లే రైటర్‌.

Spread the love