మన ఊరిలో ఎవడ్రా ఆపేది..

హీరో నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘రంగబలి’. నూతన దర్శకుడు పవన్‌ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోనాగశౌర్యకి జోడిగా యుక్తి తరేజ నటిస్తోంది.
పవన్‌ సిహెచ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ‘మన ఊరిలో ఎవడ్రా అపేది..’ పాటను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాట లోకల్‌గా ఉండే ప్రాముఖ్యతను వివరిస్తుంది. అనురాగ్‌ కులకర్ణి ఈ పాటని డైనమిక్‌గా పాడారు. నాగశౌర్య తన మాస్‌ డ్యాన్స్‌లతో పాటలో గ్రేస్‌ చూపించారు. జానీ మాస్టర్‌ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. పవన్‌ బాసంశెట్టి, శ్రీ హర్ష ఈమని కలిసి సాహిత్యం అందించారు. ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాగ శౌర్య, యుక్తి తరేజ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డీవోపీ: దివాకర్‌ మణి, ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్‌: ఏఎస్‌ ప్రకాష్‌.

Spread the love