ప్రభుత్వాస్పత్రుల్లోనే పరీక్షలు చేయించుకోవాలి

– క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్టులను సద్వినియోగం చేసుకోవాలి
– నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పారిశుధ్య కార్మికులు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్టులను సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్‌ఎంసీలోని అన్ని జోన్లలో సర్కిళ్ల వారీగా పారిశుధ్య కార్మికులకు క్యాన్సర్‌ డిటెక్షన్‌ (గుర్తింపు)ను సీ.ఎస్‌.ఆర్‌ కింద కార్కినోస్‌ కార్పొరేట్‌ బాడీ భాగస్వామ్యంతో నిర్వహిస్తుందని తెలిపారు. బుధవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12 సీ.ఎం.టి.ఇ. ఎస్‌ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు కార్కినోస్‌ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీలోని ప్రతీ సర్కిల్‌లో ఆరు రోజుల పాటు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్టులను మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహిస్తారని తెలిపారు. పారిశుధ్య కార్మికులంద రూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పారిశుధ్య కార్మికులు క్యాన్సర్‌ టెస్టుల కోసం ప్రయివేటు ఆస్పత్రుల వద్దకు వెళ్లకూడదని, ప్రభుత్వ ఆస్పత్రులుచ ఈ.ఎస్‌.ఐ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్‌ వైద్యం ఖరీదైనదని, ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరి తమ డబ్బులు వధా చేసుకోకూడదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిందని.. అందులో 40 రకాల టెస్టులను ఉచితంగా చేస్తున్నారని, అదే ప్రయివేటులో అయితే అత్యంత ఖరీదైనదన్నారు. బంజారాహిల్స్‌ ఎన్‌.బీ.టీ.నగర్‌, ఎన్‌.బీ నగర్‌లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్కినోస్‌ ద్వారా డయాగ్నోస్‌ చేయబడిన అనంతరం బయాప్సి ఆధారంగా సంబంధిత ఆస్పత్రిలో రెఫర్‌ చేసి వైద్యం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్యాన్సర్‌ వ్యాధికి అన్ని రకాల మందులు వచ్చాయని, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని చెప్పారు. పారిశుధ్య కార్మికులు ఉదయం 5:45 గంటలకు రోడ్ల ఊడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని, బయోమెట్రిక్‌ పాటించాలని తెలిపారు. వారి విధులు నిర్వహించిన అనంతరం క్యాన్సర్‌ టెస్టుల కేంద్రాలకు హాజరు కావాలన్నారు. అనంతరం కార్కినోస్‌లో సలహాదారు డాక్టర్‌ శ్రీరాం సిప్లా మాట్లాడుతూ క్యాన్సర్‌ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశ్వనాథ్‌ క్యాన్సర్‌ కేర్‌ ఫౌండేషన్‌తో భాగస్వామ్య మిషన్‌లో కలిసి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం అవుతున్నామని అన్నారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యంపై దష్టి పెట్టి క్యాన్సర్‌ అవగాహన పెంపొందించడం, ముందస్తుగా గుర్తించి చికిత్స అందించడం ఎంతో మంచిదన్నారు. వ్యక్తుల ఇంటికి దగ్గరగా సమగ్ర క్యాన్సర్‌ సంరక్షణను అందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. పూర్తి సమాచారం కోసం షషష.సaతీసఱఅశీర.ఱఅని సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, డిప్యూటీ కమిషనర్‌ రజనీకాంత్‌, సీ.ఎం.ఓ.హెచ్‌ పద్మజ, అంకాలజిస్ట్‌ డా.స్రవంతి, డా. కామాక్షి, డా.సనా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Spread the love