IT Stocks: కనిష్టాలకు కుప్పకూలిన ఐటీ దిగ్గజాల షేర్లు.. ఇప్పుడు కొనడం మంచిదేనా?


IT Stocks: యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిన తరుణంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అమెరికా డాలర్ రెండు దశాబ్దాల గరిష్టానికి ఎగిసింది. డాలర్ బలపడటంతో… రూపాయి విలువ మరింత పతనమైంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలను నమోదుచేశాయి. ఇదే నేపథ్యంలో దిగ్గజ ఐటీ షేర్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇన్ఫోసిస్ 52 వారాల కనిష్ఠాన్ని తాకగా.. టీసీఎస్ షేరు కూడా జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. మరి ఈ కనిష్ఠ విలువల వద్ద ఈ షేర్లను కొనడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

IT Stocks: ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్‌లోనూ కుదేలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 330 పాయింట్లకు పైగా పతనమైంది. ఎక్కువగా ఐటీ షేర్లు నష్టపోయాయి. దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ షేర్లు ఈ సంవత్సరం మదుపరులను (ఇన్వెస్టర్లు) తీవ్రంగా నిరాశపరిచాయి. వరుసగా తగ్గుతూ వచ్చి ఇన్వెస్టర్ల ఆస్తులను కరిగించేశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో.. ఐటీ రంగం సూచీ ఈ ఏడాది ఏకంగా 27 శాతం తగ్గడం గమనార్హం. ఇన్ఫోసిస్ షేరు గురువారం సెషన్‌లో 52 వారాల కనిష్ఠానికి చేరింది.

Spread the love