స్టూడెంట్స్‌కు సులభంగానే రుణాలు.. కేంద్రం గుడ్ న్యూస్!

 

Loan | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా ఎడ్యుకేషన్ లోన్స్‌ను మంజూరు చేసేలా ఆర్‌ఆర్‌బీలను కూడా క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్‌ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
Education Loan | విద్యార్థులకు తీపికబురు. కేంద్రం ప్రభుత్వం వీరికి మరింత సులభంగా రుణాలు అందేలా ప్రయత్నం చేస్తోంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (Banks) కూడా క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ పరిధిలోకి తీసుకురావాలని ఆలోచిస్తోంది. విద్యార్థులకు ఎక్కువ ఎడ్యుకేషన్ లోన్స్ (Education Loan) అందింలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం. దీని వల్ల స్టూడెంట్స్ మరింత సులభంగా ఎడ్యుకేషన్ లోన్స్ పొందటం వీలవుతుంది.

’మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం. ప్రత్యేకంగా కొత్త విధానాన్ని తీసుకురావాలా? లేదంటే ప్రస్తుతం ఉన్న విధానంలోనే దీన్ని అమలు చేయాలా? అనే అంశం గురించి ఆలోచిస్తున్నాం‘ అని ఈ అంశంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు తెలియజేశారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ అనేది ఎవరైనా విద్యా రుణం తీసుకొని తిరిగి చెల్లించలేక డిఫాల్ట్ అయితే అప్పుడు ఈ స్కీమ్ కింద రూ. 7.5 లక్షల వరకు బ్యాంక్‌కు డబ్బులు లభిస్తాయి.

ఆగస్ట్ 25న కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ లోన్స్‌కు సంబంధించి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల మంజూరు, పెరుగుదల వంటి అంశాలపై చర్చించింది. ఎడ్యుకేషన్ రుణాల మంజూరులో జాప్యం లేకుండా త్వరితగతిన వీటిని మంజూరు చేయాలని కేంద్రం బ్యాంకులను కోరినట్లు తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 20,450 కోట్ల ఎడ్యుకేషన్ రుణాల మంజూర లక్ష్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు జూన్ నాటికి 9 శాతాన్ని మాత్రమే సాధించాయి. ఆర్‌ఆర్‌బీలను కూడా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కిందకు తీసుకువస్తే.. అప్పుడు ఎడ్యుకేషన్ రుణాల మంజూరు పెరగొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఎడ్యుకేషన్ లోన్స్ విభాగంలో మొండి బకాయిలు పెరిగిపోవడం వల్ల బ్యాంకులు ఈ రుణాలు జారీ చేయడంలో జంకుతున్నాయి. కాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 19,175 కోట్లు విలువైన ఎడ్యుకేషన్ రుణాలను జారీ చేశాయి. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు డిజిటైజేషన్‌లో ముఖ్యపాత్ర పోషించాలని, స్పానర్స్ బ్యాంకులు ఈ అంశంపై ఫోకస్ చేయాలని సూచించారు.

Spread the love