Supply Chain: సప్లై చైన్ ఫైనాన్స్‌లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది..? ఈ కెరీర్ ఆప్షన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..


Supply Chain: వ్యాపార సంస్థలు సప్లై చైన్ కాస్ట్స్ తగ్గించుకునేందుకు మార్గాలను వెతకడం చాలా కామన్. ఇలాంటి వ్యాపార సంస్థలకు సప్లై చైన్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్‌ బాగా ఉపయోగపడతారు. కాలేజీ(College) లేదా స్కూల్స్‌ (Schools)లో చదువు (Education) అయిపోయాక సరైన కెరీర్(Career) ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే రొటీన్ కెరీర్ కాకుండా నచ్చిన కెరీర్ ఎంపిక చేసుకోవాలని అందరికీ ఉంటుంది. నిజానికి ఎంపిక చేసుకోవడానికి ప్రస్తుతం చాలా ప్రత్యేకమైన కెరీర్ ఆప్షన్లుఅందుబాటులో ఉన్నాయి. వాటిలో సప్లై చైన్ ఫైనాన్స్ (Supply Chain Finance) ఒకటి. సాధారణంగా వస్తువులు, వ్యక్తులు, వనరులను ఒక చోట నుంచి మరొక చోటికి సమర్థవంతంగా తరలించడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియలో వ్యాపార సంస్థలు సప్లై చైన్ కాస్ట్స్ తగ్గించుకునేందుకు మార్గాలను వెతకడం చాలా కామన్. ఇలాంటి వ్యాపార సంస్థలకు సప్లై చైన్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్‌ బాగా ఉపయోగపడతారు. ఒక బిజినెస్ ప్రొడక్టివిటీని పెంచడానికి, ఖర్చులను తగ్గించడానికి, డెలివరీని వేగవంతం చేయడానికి సప్లై చైన్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చాలా హెల్ప్ అవుతారు.
* సప్లై చైన్ ఫైనాన్స్‌లో కెరీర్‌
సప్లై చైన్ ఫైనాన్స్‌లో కెరీర్ బిల్డ్ చేయాలంటే బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో అడ్వాన్డ్‌ డిగ్రీలు, సంవత్సరాల ఆర్థిక అనుభవం, సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌పై సమగ్ర పరిజ్ఞానం ఉండాలి. సప్లై చైన్ ఫైనాన్స్ స్పెషలిస్ట్స్‌ బ్యాలెన్స్ షీట్లపై అవగాహన రావడానికి ఫైనాన్షియల్స్‌ చదవాల్సి ఉంటుంది. అలానే ప్రొడక్ట్స్ రవాణాకు ముందు సప్లయర్లకు ఫైనాన్సింగ్ అందించేటప్పుడు ఖర్చు అంచనాలను బడ్జెట్‌లో ఉండేలా ఒక ప్లాన్ అందించాలి. ఒక కంపెనీకి తగిన పరిష్కారాలను ఆఫర్ చేయాలి. పలు ఎంబీఏ ప్రోగ్రామ్స్‌, ఫైనాన్షియల్ అనలిస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌, బిజినెస్ ప్రోగ్రామ్స్‌ మాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తాయి. వీటి ద్వారా ఫైనాన్షియల్/బడ్జెటింగ్ స్కిల్స్ పెంచుకోవచ్చు.
*రిలేషన్‌షిప్ బిల్డింగ్, క్రెడిట్ విశ్లేషణ
సప్లై చైన్ ఫైనాన్స్ స్పెషలిస్ట్స్‌కి మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉండటం అవసరం. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కోర్సులు మేనేజ్‌మెంట్ స్కిల్స్ మెరుగుపరుస్తాయి. ఈ రంగంలో క్రెడిట్ అనాలసిస్ కోసం మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో సహా టెక్-బేస్డ్ క్రెడిట్-స్కోరింగ్ మోడల్స్‌ తీసుకొచ్చే అవసరం కూడా ఇప్పుడు ఏర్పడుతుంది. దీనికి తగినట్లుగా సప్లై చైన్ ఫైనాన్స్ స్పెషలిస్ట్స్‌కి ఉండటం అవసరం.
ఇది కూడా చదవండి : ఐటీ కంపెనీలో భారీగాఉద్యోగాలు .. ఎక్కడినుంచైనా పనిచేయవచ్చు.. భారతీయులే కావాలంట..!
* చర్చలు జరిపే తెలివి ఉండాలి
చర్చలకు తెలివి, పట్టుదల అవసరం. కమ్యూనికేషన్, వ్యూహరచన, ప్లానింగ్, కోపరేటింగ్ ద్వారా మీరు చర్చల్లో నైపుణ్యం సాధించవచ్చు. చర్చలో పట్టు సాధించేలా మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోవడానికి సర్టిఫికేషన్ కోర్సులు లేదా ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లకు అటెండ్ కావచ్చు. సస్టైనబిలిటీ డ్రైవ్ అనేది సప్లై నెట్‌వర్క్‌లను మార్చడానికి కారణమవుతుంది. ఇది సరఫరా గొలుసులోని ప్రతి వాటాదారు సస్టైనబిలిటీ స్టాండర్డ్స్‌ సంతృప్తిపరిచేలా చూసేందుకు సప్లై చైన్‌ను ఇంప్రూవ్ చేస్తోంది

Spread the love